నేడు ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు 76 వేల మంది .రాష్ట్ర పాఠశాల విద్య ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య పరీక్షల డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించే నేషనల్ మీన్స్‌కం మెరిట్ పరీక్షల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన డీఈవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.20 లక్షల మంది రాసేందుకు వీలుగా 3,300 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 22 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 115 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ స్కూల్ నుంచీ నామినల్ రోల్స్ (ఎన్‌ఆర్) తీసుకోరాదని, ఆయా పాఠశాలల నుంచే రాష్ట్ర విద్యాశాఖకు పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ కార్యాలయంలోని పరీక్షల విభాగం సిబ్బంది ఎన్‌ఆర్‌ల పేరుతో డబ్బు వసూలు చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 76,320 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలు రాసేందుకు అవసరమైన 346 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. డీఈవో విజయేంద్రరావు, పరీక్షల సహాయ కమిషనర్ గురుస్వామిరెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ గుణశేఖర్ ఆయన వెంట ఉన్నారు.
No comments:
Post a Comment