APTF VIZAG: రిటైర్మెంట్ @ 63 రాష్ట్ర సర్కారు కసరత్తు

రిటైర్మెంట్ @ 63 రాష్ట్ర సర్కారు కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోమారు పెరగనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం అవుననే! ప్రస్తుతమున్న 62 సంవత్సరాలు ఉద్యోగవిరమణ వయసును 63 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విస్తృతస్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, న్యాయపరమైన అంశాలతో పాటు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలి స్తున్నామని ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. 'అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తరువాతే తుది తుది నిర్ణయం ఉంటుంది.' అని ఆయన అన్నారు.


చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 జూన్ లో ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించగా, జగన్మోహన్రెడ్డి సర్కారు 62 ఏళ్లకు పెంచింది. తాజాగా మరో ఏడాది. పెంచాలన్న ఆలోచన వెనుక ఆర్థికాంశాలే కీలకమని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విరమణ అనంతరం ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలు మరో ఏడాది వరకు వాయిదా వేయవచ్చని, దీనివల్ల కొంత మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు.

3 comments:

  1. It is bad news to youth/unemployment.

    ReplyDelete
  2. చాలా తప్పు. ఇంకో సంవత్సరం పోయాక ఆయినా బాకీలు ఇవ్వాలి.late చెస్తే బాకీలు పెరుగుతాయి కానీ తగ్గవు.(2) 60 years వరకూ చేయలేక, ముసలి వాళ్ళూ అయ్యి,బీపీ లు,suger జబ్బులతో , మేము చేయలేము బాబోయ్, మా డబ్బులు ఇస్తే మేము పోతం అంటున్నరు. యువత job లేక ఏడుస్తున్నారు. ఒక సీనియర్ employe కి 120000 కి బదులు, ముగ్గురు కొత్త గా జూనియర్స్ వస్తారు. పర్వం nt Rama Rao, consolidated pay కి అంటే పే లో మూడవవంతు ఇచ్చి వేసుకొని, two'years అయ్యాక, reguler చేశాడు. ఎలాగైనా కొత్తగా యువతకి jobs ఇవ్వాలి.
    (3) retirement benefits ఇవ్వలేకపోతే, వాళ్లకి bonds ఇచ్చి ఒక year పోయాక, చిన్న వడ్డీ వేశి ఇవ్వవచ్చు. అంతే కానీ retirement age పెంచడం తప్పు. అసలు 62 కి పెంచడమే తప్పు.60 కి తగ్గించాలి

    ReplyDelete
  3. Dear cm sir, please dont increase retirement age, please give employment to un employees, so many un employees available at market like very good qualified person's. Please reduce retirement age to 62 to 58.un necessarily paying huge amount of salary to government employees. It's waeste of public money. Jagan sir you are having hetero, aurobindo, sakshi companies. If company is in loss simply you will terminate employees. If suppose any employee reaching o5 years service, in directly remove employee, because it is your personal money, but government means it is public money. Previously also ex cm chandra babu also done big mistake to increase retirement age 58 to 60,how thease politicians will increase retirement age. You increase your company employees age. Don't waste public money. Please provide employment to young stars. Once again iam request to jagan sir. Suppose in this 04 years every government employee got 50 lakhs, waeste of money, no use, no output. Please don't give retirement benefit to government employees. Please kindly save nation, our country, our state. Please🙏🙏🙏🙏🙏🙏 regards ksrinivasarao

    ReplyDelete

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4