ఇక ఉద్యోగులందరికీ ముఖ' హాజరు రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో జనవరి 1 నుంచి, కింది స్థాయిలో జనవరి 16 నుంచి అమలు. దీని ఆధారంగానే సెలవుల పరిగణన
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరును (ఫేషియల్ రికగ్నైజేషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్) తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల ఉద్యోగు లందరికీ ఈ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లా స్థాయి కంటే కింది స్థాయిలో ఉన్న ఆఫీసులు, డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా ఉద్యోగు లందరికీ జనవరి 16 నుంచి ముఖ ఆధారిత హాజరు అమలు చేయాలని సూచిం చింది. వీటితోపాటు స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి కార్యాలయాలు, విలేజ్వార్డు సచివాలయాల్లో కూడా ముఖ ఆధారిత హాజరును అమలు చేయాలని ఆదేశించింది. దీనిద్వారానే ఉద్యోగుల సెలవులను గణించాలని పేర్కొంది. ఈ ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ను అన్ని ఆఫీసుల్లోనూ అమలు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అమరావతి సచివాలయం లోని వివిధశాఖల ఉద్యోగులకు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడిం చింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరి కోసం ముఖ ఆధారిత హాజరు యాప్ను తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ (ఐటీఈ అండ్సి)ను ప్రభుత్వం ఆదేశించింది. మొబైల్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని అటెండెన్స్ వేసే విధంగా ఏపీసీఎఫ్ఎస్ఎస్ యాప్ను డెవలప్ చేయాలని ప్రభుత్వం ఆశాఖను ఆదేశించింది. ముఖ ఆధారిత హాజరు విధానం అమలును నోడల్ ఏజెన్సీగా ఐటీఈ అంగ్సీ శాఖను నియమిస్తు న్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
No comments:
Post a Comment