APTF VIZAG: ప్రత్యేక విద్యార్థులకు పది పరీక్షల్లో మినహాయింపులు. ఒక లాంగ్వేజ్, మూడుగ్రూప్ సబ్జెక్ట్ ల్లో మాత్రమే పరీక్షలు. ఒక్కో సబ్జెక్ట్ 10 మార్కులు సాధిస్తే పాస్. కొన్ని కేటగిరీలవాళ్లకు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టే

ప్రత్యేక విద్యార్థులకు పది పరీక్షల్లో మినహాయింపులు. ఒక లాంగ్వేజ్, మూడుగ్రూప్ సబ్జెక్ట్ ల్లో మాత్రమే పరీక్షలు. ఒక్కో సబ్జెక్ట్ 10 మార్కులు సాధిస్తే పాస్. కొన్ని కేటగిరీలవాళ్లకు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టే

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థు లకు ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు కల్పిం చింది. పరీక్ష ఫీజు నుంచి పరీక్ష పేపర్ల మూల్యాం కనం వరకు వీరికి పలు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేప థ్యంలో వీరిని 22 కేటగిరీలుగా విభజించింది. వైక ల్యం తీవ్రతను బట్టి విద్యార్థులకు మినహాయింపు లు వర్తిస్తాయి. 2022-23లో సాధారణ విద్యార్థు లకు ఆరు పేపర్లలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించ నున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక అవసరాలు కలిగి న విద్యార్థులు నాలుగు సబ్జెక్టుల్లో పరీక్ష రాస్తే సరి పోతుంది. ఒక లాంగ్వేజ్ పేపర్, మూడు గ్రూప్ సబ్జెక్టులలో పరీక్ష రాయాలి. కొన్ని కేటగిరీల విద్యా ర్థులకు ఒక్కో సబ్జెక్ట్ 10 మార్కులు, కొన్ని కేటగిరీల వారికి ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్టు పరిగణిస్తారు. ఈ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. అలాగే పరీక్ష బట్టి ఒక్కో గంటకు 20 నిమిషాల విరామం ఇస్తారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థులకు సైతం పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు.

ఈ వైకల్యం ఉన్నవారికే శారీరక వైకల్యం, కుష్టువ్యాధి, మెదడు పక్షవాతం, మరుగుజ్జుతనం, కండరాల బలహీనత, యాసిడ్ దాడి బాధితులు, అంధత్వం, వినికిడి లోపం, భాషా వైకల్యం, రాయడంలో, లెక్కలు చేయడంలో సమస్యలు, ఆటిజం, మానసిక అనారోగ్యం, దీర్ఘ కాలిక నరాల సమస్యలు, పార్కిన్సన్ బాధితులు తదితర వైకల్యాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక మిన హాయింపులు వర్తిస్తాయి.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today