APTF VIZAG: ఉద్యోగోన్నతులు పొందిన వారికి నియామకఉత్తర్వులు. ఎస్‌ఏలు, ఎస్‌జీటీలకు వారంలో అందే అవకాశం

ఉద్యోగోన్నతులు పొందిన వారికి నియామకఉత్తర్వులు. ఎస్‌ఏలు, ఎస్‌జీటీలకు వారంలో అందే అవకాశం

 ఉద్యోగోన్నతులు పొందిన స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండ్‌ గ్రేడ్‌ టీచర్లకు త్వరలో నియామక ఉత్తర్వులు అందనున్నాయి. ఈమేరకు ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగింది. హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న హెచ్‌ఎం, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడు టీచర్ల నుంచి ఆమోదం తీసుకుంది. గత నెలలోనే ఈ ప్రక్రియ పూర్తయింది. అయితే టీచర్ల బదిలీల తర్వాత వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేదు. ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పట్లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. టీచర్ల పునర్విభజనకు సంబంధించిన కేసులను హైకోర్టులో మరో బెంచ్‌కు బదిలీ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు వద్దంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఇంకా తేలలేదు. ఈనేపథ్యంలో హైస్కూలు హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్ల కొరతను తీర్చేందుకు తాత్కాలిక పద్ధతిలో ఉద్యో గోన్నతులకు సమ్మతి తెలిపి నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనుమతిచ్చారు. వారంలో వీరికి తాత్కాలిక నియామక ఉత్తర్వులు వెలువడతాయి. బదిలీల తర్వాత శాశ్వత నియామక ఉత్తర్వులు ఇస్తారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today