APTF VIZAG: ఎలక్షన్ డ్యూటీ నుంచి టీచర్లు ఔట్! బోధనేతర పనుల నుంచి తప్పించే సాకుతో ఎన్నికల విధులకు దూరంగా పెట్టే ప్లాన్ !తొలుత ఆర్డినెన్స్ జారీ, ఆపై చట్ట సవరణ

ఎలక్షన్ డ్యూటీ నుంచి టీచర్లు ఔట్! బోధనేతర పనుల నుంచి తప్పించే సాకుతో ఎన్నికల విధులకు దూరంగా పెట్టే ప్లాన్ !తొలుత ఆర్డినెన్స్ జారీ, ఆపై చట్ట సవరణ

యాప్లు, ఫొటోలు అంటూ 'బోధ'నేతర భారం దాన్ని తప్పించాలని ఉపాధ్యాయుల డిమాండ్.

మొబైల్ యాప్లలో ఫొటోలు, హాజరు, నాడు నేడు. లాంటి బోధనేతర పనుల నుంచి తమకు విముక్తి కలిగిం చాలని టీచర్లు కోరుతున్నారు. దాన్ని సాకుగా చూపి 'కాగల కార్యం...' నెరవేర్చుకునేందుకు జగన్ సర్కారు. సిద్ధమైనట్టు తెలిసింది. తన పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడానికి ఈ సాకునే వాడుకోనున్నట్టు సమాచారం. అయితే టీచ ర్లను తప్పిస్తే వారి స్థానంలో ఎన్నికల విధులు ఎవరు నిర్వర్తిస్తారు? సచివాలయాల ఉద్యోగులను ఇందుకు వినియోగిస్తారనే ప్రచారం సాగుతోంది.


ఉద్యోగులు... ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రేపు ఏ ఎన్నికల్లోనైనా టీచర్లదే కీలక పాత్ర. ఈ వ్యతిరేకత అప్పుడు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసలు టీచర్లే లేకుండా ఎన్నికలు జరి "గితే ఈ గోలే ఉండదు" అని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిబింబించకుండా ఉండాలంటే టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం ఒక్కటే మార్గమని అధికార పక్షం భావిస్తోంది. అందులో భాగంగానే కీలక ఆర్డినెన్స్ను రూపొందించినట్లు తెలిసింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచేలా వారి సర్వీసు రూల్స్కు సవరణ చేయ బోతోంది. బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమ వుతాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. సార్వత్రిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా.. ఎన్నిక సజావుగా సాగేలా చూడటం వారి బాధ్యత. ప్రజలు వారి ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే ప్రక్రియలో టీచర్లే ప్రత్యక్ష సాక్ష లుగా నిలుస్తారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ వర్గాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారి డిమాండ్లు అటుంచి అసలు జీతాలు, సాధారణ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో పొందడా నికే నానా పాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభు త్వంపై తీవ్ర వ్యతిరేక భావన వచ్చింది. అయితే అందులోనూ ఈ విషయంలో మరింత ఆగ్రహంగా ఉన్నవారు ఉపాధ్యాయులు. అందుకే గతేడాది విజయవా డలో నిర్వహించిన భారీ ధర్నాలో ఉపాధ్యాయులకే కీలక పాత్ర పోషించి, అది విజయవంతం అవ్వడానికి కారణమయ్యారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరుపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పలుర కాల మొబైల్ యాప్లతో సతమతమవుతున్న టీచర్లకు ఇది మింగుడుపడ లేదు. అనంతరం ముఖ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు మౌనం వహిం చినా అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ఇవన్నీ గమనిస్తోన్న ప్రభుత్వం ఎన్ని కల్లో టీచర్లు వ్యతిరేకంగా ఉంటారనే అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కసరత్తు చేస్తోంది. కొద్ది రోజుల్లోనే దీనిపై ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణగా మారుతుంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today