APTF VIZAG: సంక్రాంతికి టీచర్ల బదిలీలు. మంత్రి బొత్స సత్యనారాయణ

సంక్రాంతికి టీచర్ల బదిలీలు. మంత్రి బొత్స సత్యనారాయణ

ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను వచ్చే సంక్రాంతి సెలవుల్లో చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు చదువులకు నష్టం కలగకుండా ఉండేందుకు బదిలీలను సంక్రాంతి సెలవుల సమయంలో చేపట్టాలని సీఎం జగన్ తనకు చెప్పినట్లు మంత్రి బొత్సవెల్లడించారు. బదిలీల విషయంపై చర్చించేందుకు పిఆర్ టియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మిట్ట కృష్ణయ్య, వైష్ణవ కరుణానిధి మూర్తి మంత్రి బొత్సను కలువగా పై విషయాన్ని వెల్లడించారు. అయితే మరో రెండు నెలల పాటు బదిలీలను వాయిదా వేస్తే విద్యార్ధులకు నష్టం జరుగుతుందని పిఆర్టియు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మెర్జింగ్ జరిగి, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి నెలల సమయం గడిచిపోతున్నందున వెనువెంటనే బదిలీలను చేపట్టాలని కోరారు. కాగా ఈ విషయంపై మరోసారి సిఎం జగన్ చర్చిస్తానని, వీలైనంత త్వరగా బదిలీలు జరపమని కోరతానని, అలా కాని పక్షంలో సంక్రాంతి సెలవుల్లో కచ్చితంగా బదిలీలు ఉంటాయని మంత్రి బొత్స చెప్పారు.

No comments:

Post a Comment