ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ క్లబ్స్.పర్యవేక్షణకు జిల్లాలకు నోడల్ అధికారులు
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి ఉండాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్ సిఇఆర్ టి) డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులు నిర్భయంగా ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ క్లబ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
వీటిని నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు.
స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ క్లబ్లు పర్యవేక్షించేందుకు 26 జిల్లాలకు జిల్లాకొక్క స్కూల్ అసిస్టెంట్ను నియమించారు.
ఈ కార్యక్రమం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశించారు.
No comments:
Post a Comment