APTF VIZAG: విద్యార్థుల ఫీజుల వివరాలు ప్రకటించండి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

విద్యార్థుల ఫీజుల వివరాలు ప్రకటించండి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

 ► ప్రతి విద్యాసంస్థ ఫీజుల వివరాలను కళాశాలలో, తరగతిలో ప్రదర్శించాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్య కార్యదర్శి, సీఈవో ఎన్‌.రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.


► అది కూడా సంవత్సరం, కోర్సుల వారీగా పెట్టాలన్నారు. కాలేజీలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. 


► అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఓడీలు ఇవ్వట్లేదని, అడ్మిషన్లలో మెరిట్‌ను పాటించడం లేదని, హాస్టళ్లు, రవాణాకు భారీగా చార్జీలు పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.


► ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మించి ఎక్కడా వసూలు చేయకూడదని, కాలేజీల్లో గ్రీవెన్స్‌ ఏర్పాటుచేసి వాటిని కమిషన్‌కు పంపాలని అందులో పేర్కొన్నారు.


► ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇవ్వకుండా ఉంచుకోవద్దని, విద్యా దీవెన పరిధిలోకి వచ్చే విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజులు తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలుంటాయని రాజశేఖరరెడ్డి తెలిపారు. 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today