APTF VIZAG: ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి బొత్స సత్యనారాయణ గారు

ఆగస్టులో ఉపాధ్యాయుల బదిలీలు: మంత్రి బొత్స సత్యనారాయణ గారు

ఉపాధ్యాయుల బదిలీలు ఆగ స్టులో నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. గరిష్ఠంగా ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ ఉంటుందన్నారు. ఎక్కువ మంది బదిలీ అయ్యేందుకు వీలుగా ఐదేళ్లుగా నిర్ణయిం చామని పేర్కొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాల యంలో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సంఘాల నాయకులు హృదయరాజు, జీవీ నారాయణరెడ్డి, వి. శ్రీనివాసరావు, కేఎస్ఎస్ ప్రసాద్ మంగళవారం మంత్రి బొత్సని కలిశారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని మంత్రి వెల్లడించారు. బదిలీల్లో గరి స్థంగా ఎనిమిదేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవా లని, ఉపాధ్యాయులకు గతంలో కల్పించిన ఈ అవకా శాన్ని తొలగించొవద్దని మంత్రికి ఫ్యాప్టో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల విన్నవించారు.

No comments:

Post a Comment

Featured post

Link to know the mobile numbers of RJD,DEO,DyEO,MEO1&2,HM