APTF VIZAG: ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారితో సమావేశమయ్యాము.ఈ సమావేశ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు

ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారితో సమావేశమయ్యాము.ఈ సమావేశ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు

ఉన్నత పాఠశాలలో 46 రోల్ వద్ద రెండవ సెక్షన్ గా పరిగణలోకి తీసుకోవాలని కోరాము.

పిఎస్ హెచ్ఎం 100 రోల్ వద్ద అదనంగా ఇవ్వాలని ,

ఉన్నత పాఠశాలలో పది సెక్షన్ల తర్వాత హిందీతో పాటు పిఎస్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని ,

ఉన్నత పాఠశాలలలో 9,10 తరగతులకు రోల్ 10 దాటిన సమాంతరం మీడియం కొనసాగిస్తూ, సెక్షన్ ని కొనసాగించాలి. 

రోల్ తో సంబంధం లేకుండా యూపీ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలని హై స్కూల్స్లో హెచ్ఎంPD/,PET పోస్టులను రోల్ తో సంబంధం లేకుండా కొనసాగించాలని,

జులై 7 మంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరాము.

ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 ఉపాధ్యాయులకు, ప్రదానోపాధ్యాయుల కు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు.

2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మే ఆరో తారీకు నుండి జీతాలు చెల్లించాలని ప్రాతినిధ్యం చేసాము.పరిశీలిస్తామని మంత్రి గారు చెప్పారు. 

బదిలీలకు మినిమం సర్వీసు జీరో సర్వీస్ ఉంటుందని,

మ్యాగ్జిమం సర్వీస్ 5 ఏకడమిక్ ఇయర్స్ అన్ని కేటగిరీలకు అని చెప్పారు. ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ని మ్యాగ్జింగా పరిగణించాలని కోరాము.

పాఠశాలల విలీనాన్ని ఆపాలని, సమాంతర మీడియంను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాము.

మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ నెల శాలరీలు ఆలస్యం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరాము.

మున్సిపల్ సర్వీస్ రూల్స్ ని అమెండ్ చేసి అర్బన్ MEO, అర్బన్ డివైఓ పోస్టులను పూర్తి కోరాము.

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పోస్ట్ లను అప్గ్రేడ్ చేయాలని ప్రాతినిధ్యం చేసాము.

ఈ సమావేశంలో FAPTO చైర్మన్ ఎన్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ సిహెచ్ మంజుల , V. శ్రీనివాసరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ , కార్యవర్గ సభ్యులు కె ఎస్ ఎస్ ప్రసాద్ , G.హృదయ రాజు,GVనారాయణరెడ్డి , MVSN ప్రసాద్ హాజరయ్యారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4