APTF VIZAG: బడుల విలీనంపై ప్రభుత్వానికి నోటీసులు. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ

బడుల విలీనంపై ప్రభుత్వానికి నోటీసులు. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ

జాతీయ విద్యా విధానం ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రి యను నిలువరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, ఏపీ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, విద్యా పరిశోధన, శిక్షణ రాష్ట్ర మండలి డైరెక్టరుకు నోటీ సులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే వ్యవ హారంపై దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్న జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయా జులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం జారీచేసిన జీవోలు 117, 128, 84, 85 ను సవాలు చేస్తూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4