APTF VIZAG: టీచర్ల బయోమెట్రిక్ హాజరు 1 నుంచి తప్పనిసరి.ఆన్లైన్ సమావేశంలో స్పష్టం చేసిన విద్యాశాఖ

టీచర్ల బయోమెట్రిక్ హాజరు 1 నుంచి తప్పనిసరి.ఆన్లైన్ సమావేశంలో స్పష్టం చేసిన విద్యాశాఖ

రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆగస్టు ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరును తప్ప నిసరి చేస్తున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది . మంగళవారం వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు .

 జిల్లాల్లో అనేక పాఠశాలల్లో ఒకటి , ఆరో తరగతుల్లో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు జీరోగా ఉందని , జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు కొత్తగా చేరిన బాలబాలికల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో బుధవారం లోగా నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు . అట్లు చేయని ప్రధానొపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . 

వచ్చే నెలలో జరిగే రేషనలైజేషన్ కౌన్సెలింగ్ ఈనెల 28 వ తేదీ రోలు ఆధారంగా జరపనున్నట్లు పేర్కొన్నారు .

జిల్లాలోని అన్ని తరగతుల పాఠశాలలు , అన్ని మేనేజ్మెంట్ల పాఠశా లలు ప్రతిరోజు ఉదయం 10:30 లోపు విద్యార్థుల హాజరు మొబైల్ యాప్లో నమోదు చేయాలన్నారు . 

ఆగస్టు ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరుతో పాటుగా సదరు కొత్త యాప్లో అన్ని రకాల లీవులు నమోదు చేయాల్సి ఉంటుంద ని సూచనలు చేశారు

 విద్యాశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ , కాంట్రాక్ట్ , అవుటో ర్సింగ్ ఉపాధ్యాయులు , బోధనేతర సిబ్బంది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తమ డేటా నమోదు చేయాలని స్పష్టం చేశారు .

 ఉపాధ్యాయుల ప్రమోషన్లు , ట్రాన్స్ఫర్లు టీఐసీ డేటా ఆధారంగా జరుగుతాయని , కనుక అందరూ తమ డిజిగ్నేషన్స్ , జాయినింగ్ తదితర అన్ని రకాల వివరాలు సరిగా ఉన్నాయా అనేది చూసుకుని అప్ డేట్ చేసుకోవాలని సూచించారు

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4