APTF VIZAG: ఆన్ లైన్ హాజరు నమోదులో ఆలస్యమైతే షోకాజ్ నోటీసులు

ఆన్ లైన్ హాజరు నమోదులో ఆలస్యమైతే షోకాజ్ నోటీసులు

 పాఠశాలల్లో ఉదయం 10.30 గంటలలోపు విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయకపోతే ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. విద్యార్థి హాజరు యాప్లో సకాలంలో నమోదు చేయలేదంటూ కర్నూలు జిల్లాలో పలు పాఠశా లలకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. ఉదయం 9.15కు ప్రార్థన పూర్తవుతుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థుల కోసమని మొదటి పీరియడ్ తర్వాత హాజరు తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబు తున్నారు. మొదట రిజిస్టర్ లో హాజరు తీసుకొని, ఆ తర్వాత యాప్లో నమోదు చేయాలని, విద్యార్థులు సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇంటర్నెట్ సమస్యలు ఏర్ప డితే కొంచెం ఆలస్యమవుతుందని వెల్లడిస్తున్నారు. కొంత అదనపు సమయం ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఒత్తిడి తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment