APTF VIZAG: 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో 'అభ్యసన అభివృద్ధి. తొలుత పది జిల్లాల్లో ప్రయోగాత్మక కార్యాచరణ

6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో 'అభ్యసన అభివృద్ధి. తొలుత పది జిల్లాల్లో ప్రయోగాత్మక కార్యాచరణ

కోవిడ్-19 తర్వాత విద్యార్థుల్లో వచ్చిన అభ్యసన అంతరాలను సత్వరమే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. యునిసెఫ్, సీఐపీఎస్ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లి క్ సిస్టమ్), సేవ్ ది చిల్డ్రన్తోపాటు గ్రామ, వార్డు స చివాలయ శాఖ భాగస్వామ్యంతో పాఠశాల విద్యా శాఖ దీనిని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పై విభా గాల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపు ణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్న మయ్య జిల్లాల్లో ముందుగా అమలు చేస్తారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4