కేజీబీవీ టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు.రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) పని చేస్తున్న బోధనా సిబ్బంది బదిలీలకు అనుమతి నిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
బదిలీలు ఆన్లైన్ విధానంలో, పునర్విభజనకు ముందున్న జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపాల్, సీఆర్టీ, పీఈటీ, పీజీటీలు ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరవచ్చు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ప్రిన్సిపాల్స్, ఎనిమిదేళ్ల సర్వీసున్న సీఆర్టీ, పీఈటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. బదిలీలన్నీ సంబంధిత జిల్లాలోనే చేపట్టాలి. మ్యూచువల్ ఆమోదం ఉంటేనే అంతర్ జిల్లా బదిలీకి అవకాశం కల్పిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ బదిలీల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా, డీఈవో సభ్యులుగా, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ మెంబర్ కన్వీనర్ గా, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
No comments:
Post a Comment