సాంకేతిక లోపం కారణంగానే ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలో సమస్యలు ఏర్పడ్డాయని ప్రభుత్వం వివరించింది. ఈ మేకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత వివరణ ఇచ్చింది. ఈ వివరణ ప్రకారం ఉద్యోగులు జిపిఎఫ్ ఖాతాల్లో డిఎ బకాయిల నిధులు అసలు జమ కానే లేదు. డిఎ బకాయిల బిల్లులు సంబంధిత అధికారుల నుండి క్లియరెన్స్ కోసం సంబంధిత పేమెంట్ అప్లికేషన్ వద్దకు వెళ్లాయి. అక్కడ క్లియర్ కాకముందే సాంకేతిక సమస్యల వల్ల జిపిఎఫ్ ఖాతాల్లో తప్పుగా క్రెడిట్ అయ్యాయి. ఆ మేరకు మొత్తం ఖాతాల్లో కనిపించింది కానీ నిజానికి జమ కాలేదని ప్రభుత్వం తెలిపింది ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31వ తేదిన పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను ట్రెజరీ ఆఫీసర్ క్యాన్సిల్ చేస్తారని. ఆ పని ఆయన చెయ్యడంతో తప్పుగా క్రెడిట్ అయిన మొత్తాన్నికూడా సిస్టమ్ సాఫ్ట్ వేర్ వెనక్కి తీసుకుందని పేర్కొంది. దీంతో డబ్బులు జమ చేసి వెనక్కి తీసుకున్నట్లుగా కనిపించిందని వివరించింది. ఈ డిఎ మొత్తం మినహా జిపిఎఫ్ ఖాతాలకు సంబంధించిన ఏ ఇతర మొత్తమూ ఆటో డెబిట్ కాకపోవడాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం సాంకేతిక లోపాన్ని సరిదిద్దుతామని, డిఎ బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించి ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని పేర్కొంది.
No comments:
Post a Comment