APTF VIZAG: ఉద్యోగుల జీపీఎఫ్ మాయం!ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగుల జీపీఎఫ్ మాయం!ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేస్తుందనే విపక్షాల ఆరోపణ ల నేపథ్యంలో ప్రభుత్యోగుల జీపీఎఫ్ రూ.800 కోట్లు మాయం అయినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రేకెత్తించాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండా నగదు ఉపసంహ రించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్రిమినల్ కేసులు పెడతామని సూర్యనారాయణ హెచ్చరించడం కలకలం సృష్టిస్తోంది. గతంలో ఇదే తరహాలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తే తిరిగి డబ్బులను జమ చేశారన్నారు. తమ ఖాతాల్లో డబ్బులు ఉపసంహరించినట్లు గత రాత్రి ఉద్యోగులకు సందేశాలు వచ్చాయన్నారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి 83 వేల రూపాయలు విత్ డ్రా చేసేశారన్నారు. తానొక్కడిదే కాదని రాష్ట్రంలోని 90 వేల మంది ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నారని తెలిపారు.

జీపీఎఫ్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకుని చూస్తే తమ ఖాతాల్లో నగదు ఉపసంహరించినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసేం దుకు వెళ్తే అధి కారులు అందుబాటులో లేరన్నారు. ఉద్యో గుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచిసొమ్ము విత్ డ్రా చేయడం నేరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి తెలిసే జరి గాయా.. లేక అధికారుల తప్పిదమా తెలియదన్నారు.. ఏది ఏమైనా మా సమ్మతి లేకుండా మా ఖాతాల నుంచి విత్ డ్రా చేయడం నేరమని, విత్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ ఖాతాల్లో ఉప సంహరించిన నగదు తిరిగి జమ జమ చేసినా క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరిం చారు. ఉద్యోగుల ఖాతాల నుం చి నగదు విత్ డ్రా చేసే సాంకేతికత ఉండటం చట్టబద్దమా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల కోసం ప్రభు త్వం కాళ్ళు పెట్టు కోవడమే తక్కువ యిందని సూర్య నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకా యిలు చెల్లించ మని ప్రభుత్వాన్ని అడిగితే డీఏ బకా యిలను కూడా ప్రభుత్వం డ్రా చేసిందనీ ఆరోపించారు. తమ అనుమతి లేకుం డా మా ఖాతాల నుంచి నగదు ఉప సంహరించే అధికారం ప్రభుత్వానికి ఎక్క డిదని ఆయన నిలదీసారు. ఈ విషయంపై ఏజీని కూడా ప్రస్నుస్తా మన్నారు. మార్చి నెలాఖరులో జరిగిన లావాదేవీలను ఇప్పటివరకు చెప్పకపోవడమూ తప్పిదమేనని సూర్య నారాయణ అన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today