APTF VIZAG

విద్యార్థులకు ట్యాబ్ లు, తర గతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశిం చారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు సెప్టెంబరులో ట్యాబ్ లు ఇస్తామని వెల్లడించారు. మంగళవారం 'నాడు-నేడు'పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డుతూ.. "విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లో బైజూస్ కంటెం ట్ను అప్లోడ్ చేయాలి. దీనికి తగినట్లు ట్యాబ్ స్పెసి ఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. ఎనిమిదో తరగ తిలో ఇచ్చే ట్యాబ్ 9, 10 తరగతుల్లోనూ పని చేయాలి. మూడేళ్లపాటు ట్యాబ్ నాణ్యతతో పని చేయాలి.  ఏదైనా సమస్య వస్తే దానికి మరమ్మతులు చేసే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మంచి కంపెనీ లను పరిగణనలోకి తీసుకోవాలి" అని సూచించారు. "తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొం దించాలి. తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్, బ్లాక్ బోర్డుల అమరిక ఎలా ఉండాలన్న దానిపై ఆలోచించాలి. స్క్రీన్ మీద కంటెంట్ను హైలైట్ చేసుకునేలా.. బొమ్మ పరిమాణం పెంచుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల భద్రత పైనా దృష్టి పెట్టాలి" అని వెల్లడించారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరి కొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాది స్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

No comments:

Post a Comment