అమ్మఒడి సాయం 27న.అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ఈనెల 27న తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి శ్రీకాకుళంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43,19,090 మంది తల్లుల జాబితాను గ్రామ, వార్డు సచివాల యాలకు పంపించారు. ఇందులో 41,70203 మంది తల్లుల ఈ కేవైసీ పూర్త . అర్హత కోల్పోయిన వారి జాబితాలను మాత్రం సచివాలయాలకు పంపించలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏ కారణంతో తాము అర్హత కోల్పోయామో చెప్పాలని నిలదీస్తున్నారు. తల్లుల నుంచి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2021 జనవరి 11న 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేశారు. మరు గుదొడ్ల నిర్వహణ కోసం రూ. వెయ్యి చొప్పున మినహాయించి, మిగతా రూ.14 వేలు మాత్రమే ఇచ్చారు. ఈసారి పాఠశాలల నిర్వహణకు రూ.2 వేలు మిన హాయించనున్నారు. మిగతా రూ.13 వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
2209050152
ReplyDelete21092506039
ReplyDelete