APTF VIZAG: C.C.A. RULES - IN BRIEF

C.C.A. RULES - IN BRIEF

సస్పెన్షన్ Vs రిమూవల్ Vs డిస్మిస్

రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరికీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసు (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్అప్పీల్) రూల్స్ 1991 వర్తిస్తాయి. ప్రోవి్ిటలైజెషన్ చేయబడినందున పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఎ) స్వల్ప దండనలు: 1) అభిశంసన, 2) పదోన్నతి నిలుపుదల, 3) ప్రభుత్వమునకు కలిగిన ఆర్థిక నష్టమును రాబట్టుట ఇంక్రిమెంట్లు నిలుపుదల, 5) సస్పెన్షన్

బి) తీవ్ర దండనలు: 1) సీనియారిటీ ర్యాంక్ను తగ్గించుట లేక క్రింది పోస్టునకు / స్కేల్నకు తగ్గించుట, 2) నిర్బంధ పదవీ విరమణ, 3) సర్వీసు నుండి తొలగించుట (Removal) 4) బర్తరఫ్ (Dismissal) (సర్వీసు నుండి తొలగించబడిన ఉద్యోగి భవిష్యత్తులో తిరిగి నియామకం పొందులకు అర్హుడు. కాని డిస్మిస్ చేయబడిన ఉద్యోగి భవిష్యత్ నియామకమునకు అర్హుడు కాడు.

సస్పెన్షన్ : తీవ్ర అభియోగములపై విచారణ జరుగుచున్నప్పుడు లేక క్రిమినల్ అభియోగముపై దర్యాప్తు లేక కోర్టు విచారణ జరుగుచున్నప్పుడు మాత్రమే ప్రజాహితం దృష్ట్యా ఒక ఉద్యోగిని సప్సెన్షన్లలో వుంచవచ్చును. సప్పెషన్షన్ ఉత్తర్వు ఉద్యోగికి అందజేయబడిన తేదీ నుండి మాత్రమే అమలులోకి వచ్చును.

ఉద్యోగికి 48 గంటలకు మించిన జైలు శిక్ష విధించబడినప్పుడు లేక డిటెన్షన్ క్రింది 48 గంటలు కస్టడీలో వుంచబడినప్పుడు అట్టి తేదీ నుండి సప్పెన్షన్లో వుంచబడినట్లు పరిగణిస్తారు.

సస్పెన్షన్ కాలంలో FR53 ననుసరించి అర్ధజీతపు సెలవు కాలవు జీతమునకు సమానంగా సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తారు. 6 నెలల తరువాత దానిని 50% పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయవచ్చు. నియామక ఆధికారికి  పై అధికారి తన సమీక్షానంతరం దానిని కొనసాగించవచ్చును. విచారణలోనుండగా సప్పెన్షన్ శిక్షా చర్యకాదు. పాక్షిక నిర్దోషి అని తేలితే సబ్సిస్టెన్స్ ఆలవెన్స్ ని తగ్గకుండా జీతం నిర్ణయం  చేయవచ్చు.

No comments:

Post a Comment