APTF VIZAG: సీపీఎస్ స్థానంలో జీపీఎస్ .. ఉద్యోగ సంఘాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన

సీపీఎస్ స్థానంలో జీపీఎస్ .. ఉద్యోగ సంఘాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన

ఉద్యోగ సంఘాల ముందు కొత్త ప్రతిపాదన 

రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ( జీపీఎస్ ) పేరిట కొత్త స్కీం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది . సీపీఎస్ బదులు జీపీఎస్ పథకం అమలు చేయాలని ప్రతిపాదన చేసింది . దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తూ .. “ సీపీఎస్ స్థానంలో జీపీఎస్ స్కీమ్ను ప్రభుత్వం ప్రతిపాదించింది . జీపీఎస్ పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది . పాత పెన్షన్ విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరాం . కొత్త స్కీంపై మేం అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం . జీపీఎస్ పేరిట కొత్త స్కీమ్ ఆమోదయోగ్యం కాదని చెప్పాం . కాగా , జీపీఎస్ , సీపీఎస్కు తేడా ఏంటనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదు . ప్రభుత్వం ఏదో విధంగా జీపీఎస్ తీసుకురావాలని చూస్తోంది . మేం జీపీఎస్ ను ఒప్పుకోం " అని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు .

No comments:

Post a Comment