APTF VIZAG: Finance Department give permission APPSC to fill Group 1 and Group 2

Finance Department give permission APPSC to fill Group 1 and Group 2

గ్రూప్‌ పోస్టుల భర్తీకి ఓకే గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 182 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ : గ్రూప్‌-1లో 110 ఉద్యోగాలు, గ్రూప్‌-2లో 182 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గురువారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత ఏడాది జూన్‌లో.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది. అందులో గ్రూప్‌-1 పోస్టులు 31, గ్రూప్‌-2 పోస్టులు 5 మాత్రమే ప్రకటించారు. దీనిపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. దీంతో ఆ పోస్టులను కొంతమేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 

గ్రూప్‌-1లో ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్‌-10, వాణిజ్య పన్నుల అధికారి-12, జిల్లా రిజిస్ర్టార్‌, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రిజిస్ర్టేషన్స్‌-6, డీఎస్పీ-13, డీఎస్పీ జైళ్లు (పురుషులు)-2, జిల్లా అగ్నిమాపక అధికారి-2, ఆర్టీవో-7, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌-3, మున్సిపల్‌ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌-1, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌2-8, డిప్యూటీ రిజిస్ర్టార్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌-2, వైద్యశాఖలో అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి-15, ట్రెజరర్‌ గ్రేడ్‌2-5, ఆర్థికశాఖలో అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి-8, ఏఏవో-4, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి-1, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి-3, జిలా ్లగిరిజన సంక్షేమఅధికారి-1, ఎంపీడీవో-7 పోస్టులున్నాయి. గ్రూప్‌-2లో ఉద్యోగాలు డిప్యూటీ తహశీల్దార్‌-30, సబ్‌ రిజిస్ర్టార్‌ గ్రేడ్‌2-16, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌2-5, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌-10, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌-15, జీఏడీ సచివాలయంలో ఏఎ్‌సవో-50, లా విభాగంలో ఏఎ్‌సవో-2, లెజిస్లేచర్‌ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-4, ఆర్థిక శాఖలో సీనియర్‌ అకౌంటెంట్‌-10, జూనియర్‌ అకౌంటెంట్‌-20 తదితర పోస్టులు ఉన్నాయి.

No comments:

Post a Comment