APTF VIZAG: Aadhar and PAN card linking last Date March 31st

Aadhar and PAN card linking last Date March 31st

గ‌డువు పొడిగింపు లేదు.. ఆధార్‌కు పాన్ లింకు కాకుంటే రూ.10 వేల జ‌రిమానా

ఆధార్ కార్డకు పాన్కార్డును లింకు చేసుకునేందుకు ఈ నెలాఖ‌రు వ‌ర‌కే గ‌డువు ఉంది. ఇప్ప‌టికే గడువు ముగిసినా.. కరోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ నెల 31వ‌ర‌కు గ‌డువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ గడువును మ‌రోమారు పొడిగించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేసిన సీబీడీటీ.. 31లోగా ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేయ‌ని వారిపై రూ.10 వేల జ‌రిమానాను విధిస్తామ‌ని హెచ్చ‌రించింది.

కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయించడం తప్పనిస‌రి అన్న సంగ‌తి తెలిసిందే. అయినా ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం గ‌డువును ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గ‌డువు తేదీ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో సోమ‌వారం నాడు సీబీడీటీ నుంచి జ‌రిమానా హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4