APTF VIZAG: 1 న ' లిప్ ' అసెస్మెంట్ పరీక్ష • పాఠశాల విద్యార్థులకు రోజుకో కొత్త పదంపై శిక్షణ

1 న ' లిప్ ' అసెస్మెంట్ పరీక్ష • పాఠశాల విద్యార్థులకు రోజుకో కొత్త పదంపై శిక్షణ

ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోజుకో పదం నేర్పించేందుకు విద్యాశాఖ ప్రవేశపెట్టిన వంద రోజుల ' లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ' ఈ నెల 31 తో ముగుస్తోంది .

హిందీ , ఇంగ్లిష్ , తెలుగు భాషలకు సంబంధిం చిన కొత్త పదాలను విద్యార్థులకు పరిచయం చేయడం తోపాటు , చదవడం , పలకడం , రాయడం నేర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లిప్ను నిర్వ హించారు . వంద రోజుల ఈ కార్యక్రమం మార్చి 31 తో ముగు స్తుండటంతో ఏప్రిల్ ఒకటో తేదీన విద్యార్థులకు అసెస్మెంట్ పరీక్షనిర్వ హిం చనున్నారు

లిప్ నేర్చుకున్న వాటిలో ఉత్తమ ప్రతిభ కన బరచిన విద్యా ర్థులను ప్రతి జిల్లా నుంచి ముగ్గురిని చొప్పున , ప్రతి జిల్లా నుంచి కార్య క్రమాన్ని బాగా నిర్వ హిం చిన ఇద్ద రేసి ప్రధా నోపాధ్యా యులను గుర్తిం చి , వారిని సత్క రించాలని అధికారులు నిర్ణయించారు

అలాగే ఒకటో తేదీన నిర్వహించే పరీక్ష ప్రాథమిక తరగతుల విద్యార్థులకు 20 , ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 30 మార్కులకు ఉంటుంది . మూడు భాషలకు సంబంధించి ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించి , ప్రాథమిక తరగతులకు 20 , హైస్కూల్ విద్యార్థులకు 30 నిమిషాలు కేటాయించి పరీక్ష నిర్వహిం చనున్నారు . ప్రతి భాష నుంచి ఐదు ప్రశ్నలు చొప్పున ఇస్తే .. విద్యార్థులు వాటికి మిగిలిన రెండు భాషల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది .

ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 6 , 7 తేదీల్లో సిద్ధం చేసి , తర్వాతి రోజుల్లో ఎంఈవోలకు , ఆ తర్వాతి రోజుల్లో డీఈవో , ఆర్జేడీలకు పంపాల్సి ఉంటుంది . ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జోనల్ స్థాయిలో ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు .

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today