APTF VIZAG: Learn a word a dayఅన్ని యాజమాన్య పాఠ శాల ల్లో రేపటి నుండి అనగా 15-02-2022 నుండి 15-03-2022 వరకు "learn a word a day" programme నిర్వహించాలి.

Learn a word a dayఅన్ని యాజమాన్య పాఠ శాల ల్లో రేపటి నుండి అనగా 15-02-2022 నుండి 15-03-2022 వరకు "learn a word a day" programme నిర్వహించాలి.

📌విద్యార్థుల స్థాయిని( తరగతిని) బట్టి 4 లెవెల్స్ గా విభజించాలి.

లెవెల్ 1 :1 నుండి 2 తరగతులు

 లెవెల్ 2 :3 నుండి 5 తరగతులు

 లెవెల్ 3 :6 నుండి 8 తరగతులు

 లెవెల్ 4 : 9 మరియు 10     తరగతులు

నిర్వహణ విధానం:

📌ఈ కార్యక్రమం 30 రోజుల పాటు నిర్వహించాలి.

📌ప్రతి రోజు  మొదటి పీరియడ్ లోఒక కొత్త ఆంగ్ల పదం పరిచయం చెయ్యాలి.

📌రెండవ పీరియడ్ లో పిల్లలచేత డిక్షనరీలో ఆ పదం యొక్క అర్థాన్ని వెతికించాలి.

గమనిక : లెవెల్ 1 విద్యార్థులకు  ఆ రెండవ పీరియడ్ ఉపాధ్యాయుడే పదం యొక్క అర్థాన్ని వివిధ  ఉదాహరణలతో, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

📌ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో పదాన్ని వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

📌4 వ పీరియడ్ లో level specific activities క్రింది విధంగా నిర్వహించాలి.

 📌లెవెల్1:ఓరల్ డ్రిల్లింగ్

 📌లెవెల్ 2 :స్పెల్లింగ్ గేమ్

 📌లెవెల్ 3 :  విద్యార్థులు డిక్షనరీ సహాయంతో పదం యొక్క parts of speech కనుక్కోవాలి.

 📌*లెవెల్ 4 :విద్యార్థులు డిక్షనరీ సహాయంతో వ్యతిరేఖ పదాలు,సమాన అర్థ పదాలు వెతకాలి.

📌అదే పదం మిగిలిన అన్ని పీరియడ్ లలో repeat చెయ్యాలి.

📌ప్రతి రోజు ఒక పదాన్ని బోర్డ్ పై ఒక మూలలో వ్రాయాలి.వరండా లో, అసెంబ్లీ లో ప్రదర్శించాలి.

📌 అందరు టీచర్లు పదాన్ని,దాని అర్థాన్ని పీరియడ్ లో 5 నిమిషాలు పిల్లలచే ప్రాక్టీస్ చేయించాలి.

అయితే పదం యొక్క ఉపయోగిత మాత్రం ఆంగ్ల ఉపాధ్యాయుడు బోధించవచ్చు.

📌ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక 100 పేజీల నోటు పుస్తకం పెట్టాలి.ఆ పుస్తకాన్ని ఉపాధ్యాయుడు తరచూ తనిఖీ చెయ్యాలి.

📌ప్రతి పక్షానికి (15 రోజులు), అంతవరకు నేర్పించిన పదాల పై "స్పెల్ బీ" నిర్వహించాలి.

📌ఇంటివద్ద పదాలను ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహించాలి.

📌లెవెల్ వారీ ఏ రోజు ఏ పదం నేర్పాలో ప్రొసీడింగ్స్ లోని annexures1-4 లో ఇవ్వబడినది.

No comments:

Post a Comment