APTF VIZAG: సమ్మెకు వెళ్తే అనేక ఇబ్బందులు వస్తాయి.. చర్చలకు రండి: సీఎస్​ సమీర్​శర్మ.కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు..

సమ్మెకు వెళ్తే అనేక ఇబ్బందులు వస్తాయి.. చర్చలకు రండి: సీఎస్​ సమీర్​శర్మ.కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు..

PRC ISSUE IN AP: ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమేనని.. అయితే చర్చించి వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్​ సూచించారు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలని.. పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందన్నారు. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్న సీఎస్​.. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమేనని​ స్పష్టం చేశారు.

కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలి. పే స్లిప్‌లో 10 రకాల అంశాలు ఉంటాయి.. అన్నీ సరిచూడాలి. 11వ పీఆర్‌సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చారు. ఉద్యోగులకు ఐఆర్ రూపంలో రూ.18 వేల కోట్లు ఇచ్చాం. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నాం. కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రెండున్నర ఏళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నాం. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయాలి. అయినా.. తెలంగాణలా మేం డీఏ ఇవ్వలేదు.. ఐఆర్ ఇచ్చాం. తెలంగాణలా మేం కూడా డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేది. - సమీర్​ శర్మ, సీఎస్

No comments:

Post a Comment