APTF VIZAG: రామన్ ఎపెక్ట్ ఆవిష్కరణ ఫిబ్రవరి28.జాతీయ సైన్సు దినోత్సవ శుభాకాంక్షలు

రామన్ ఎపెక్ట్ ఆవిష్కరణ ఫిబ్రవరి28.జాతీయ సైన్సు దినోత్సవ శుభాకాంక్షలు

అది1928వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీ..భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ (సర్.సి.వి.రామన్) ఒక వినూత్న, విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేసిన పండుగరోజు.

ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ" లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని కూడ అంటారు

ఫిబ్రవరి 28, 1928న సర్‌ సి.వి.రామన్‌, తన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా ప్రకటించింది.

భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్‌ సైన్స్‌ డే లక్ష్యాలు

ఈ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలయిన DRDO, ISRO వంటి సంస్థల్లోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు.

ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని జరపడం ప్రతి యేడాది ఆనవాయితీ అయింది.

ముఖ్యంగా ప్రతి విద్యార్తి స్రుజనాత్మకంగా అలోచింపజేసె తత్వాన్ని ప్రొత్సహించటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం

రామన్ ఫలితము - అనువర్తనాలు (ఉపయోగాలు)

అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు

రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు

అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు

కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆటోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది

మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది

వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసు కోవచ్చు

.మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.

డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు

మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.

వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.

జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు

ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.

కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు

సైన్సు ఒక జీవన విధానం. సైన్సు మనకు ఎమి తెలియని అయోమయస్తితి నుండి , నిర్దిస్టమైన అవగాహన దిశగా , ఖచ్చితమైన ,విశ్వసనీయమైన మార్గం గుండా తీసుకొని పోతుందని  అనటంలో ఏలాంటి సందేహం లేదు

ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైన ఆర్థిక , సమాజిక , పారిశ్రమిక అభివృద్ధి అనేది ఆ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే  కొలమానంగా పరిగనించ బడుతుంది . అందుకే నేడు  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక కొలమానం గా మారిది. నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అననేది ప్రగతికి చిహ్నం

1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్  బిరుదుతో ఆయనను సత్కరించింది.

రామన్ ఎఫెక్టు అసామాన్య మైనదని, అందులో కనీసం  200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైన దని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు

ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి

భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా చేసుకోగలిగాం

ఈ రోజు విద్యా సంస్థలలో ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతారు, విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా ప్రోత్సహిస్తారు.

రామన్ తన ప్రయోగానికీ  అయిన ఖర్చు  కేవలం 200 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ  ఖర్చుతో ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రావటం అనేది ఇంత వరకు జరుగలేదు , భవిష్యత్తులో కూడ జరగదు. నోబెల్ బహుమతితో తనకు వచ్చిన డబ్బుతో భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం అయిన భారతీయ విజ్ఞానసంస్థానం  (Indian Institute of science) కు విరాళం ఇవ్వటం జరిగింది.

ఇలా _ఎందరో మన దేశానికి చెందిన  శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో  మన దేశ ఎనలేని కీర్తి  ప్రతిష్టలతో  దేశ కీర్తిప్రతిష్టలను విశ్వవ్యాప్తం   చేశారు. విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం.

అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం

1 comment:

  1. Caesars Palace Hotel & Casino - JetBlue Vacations
    Getaway 청주 출장안마 at 경상북도 출장안마 Harrah's Philadelphia Casino 서귀포 출장샵 & Hotel in Philadelphia. 구리 출장마사지 Hotel 문경 출장안마 resort, casino, spa, concert venue, shopping.

    ReplyDelete

Featured post

AP 10th class public exams result released today