APTF VIZAG: WhatsApp New features

WhatsApp New features

వాట్సాప్ లో కనిపించనున్న కొత్త ఫీచర్లు!

ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ కు భారత్ లో 50 కోట్ల మంది యూజర్లున్నారు. దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్లో ఇది కనిపిస్తుంది. భారీ యూజర్లను కలిగి ఉన్నందున ఈ సంస్థ ఎప్పుడూ సరికొత్త, అత్యాధునిక ఫీచర్లతో ఫస్ట్ చాయిస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది మరిన్ని ఫీచర్లను యూజర్ల ముంగిటకు తీసుకురానుంది.

కమ్యూనిటీలు

వాట్సాప్ లో ఇప్పటి వరకు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడాన్ని చూశాం. ఇలా కొన్ని గ్రూపులు కలసి కమ్యూనిటీగా ఏర్పడొచ్చు.  ఒక కమ్యూనిటీలో 10 గ్రూపుల వరకు ఉండొచ్చు. కమ్యూనిటీ పరిధిలోని అన్ని గ్రూపులకు ఒక మెసేజ్, ఇమేజ్, ఫైల్ పంపించాలంటే గ్రూపు అడ్మిన్లకే అధికారం ఉంటుంది. ఈ ఫీచర్ పై వాట్సాప్ పనిచేస్తోంది.

ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి యాపిల్ కు

యాపిల్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కు చాట్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ను ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్ నుంచి చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్లకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. త్వరలో ఆండ్రాయిడ్ నుంచి యాపిల్ ఫోన్ కు కూడా ఇదే మాదిరిగా బదిలీ చేసుకునే ఫీచర్ రానుంది.

అడ్మిన్లకు మరిన్ని అధికారాలు

గ్రూపు అడ్మిన్లకు మరిన్ని ఆప్షన్లను తీసుకురావడంపై వాట్సాప్ దృష్టి సారించింది. సభ్యులు పంపిన ఎటువంటి మెసేజ్ ను అయినా అడ్మిన్లు డిలీట్ చేయవచ్చు.

సమీపంలోని వ్యాపారాన్ని గుర్తించొచ్చు

బిజినెస్ నియర్ బై అనే ఫీచర్ పై వాట్సాప్ టీమ్ పనిచేస్తోంది. ఈ ఆప్షన్ తో యూజర్లు తమకు సమీపంలో ఉన్న వ్యాపార సంస్థలు.. రెస్టారెంట్లు, గ్రోసరీ స్టోర్లు, వస్త్రాలయాలు, ఔషధ శాలలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఎప్పుడైనా డిలీట్

ఎదుటివారికి మనం పంపిన చాట్ ను కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మీ వరకేనా, ఇద్దరికీ డిలీట్ చేసేయాలా? అని వాట్సాప్ అడుగుతుంది. కాకపోతే దీనికి ఇప్పటివరకు సమయం పరిమితి ఉంది. దీన్ని తీసేయనుంది. అంటే ఒకరికి పంపిన మెస్సేజ్ లు, ఫైల్స్, చాట్స్ ను వారి ప్రమేయం లేకుండా మీరు వారి ఫోన్  నుంచి ఎప్పుడైనా తీసేయగలరు.

ఎప్పుడైనా లాగౌట్

వాట్సాప్ లో డిలీట్ మై అకౌంట్ కు బదులు లాగవుట్ ఆప్షన్ రానుంది. అప్పుడు యూజర్లు లాగవుట్ అయ్యి మళ్లీ కోరుకున్నప్పుడు లాగిన్ అయ్యి వినియోగించుకోవచ్చు. దీనివల్ల వాట్సాప్ ఖాతాకు భద్రత పెరగనుంది

1 comment:

  1. పోస్ట్ చేసిన మెసేజ్ ఎప్పుడైన డిలీట్ చేసుకోవచ్చు అని చాల రోజుకు నుంచి చెప్తూనే ఉన్నారు...but ఇప్పటికి గంట మాత్రమే ఉంది...

    ReplyDelete