APTF VIZAG: PRC పైమంత్రి బొత్స సత్యనారాయణ గారు.ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించడానికే చర్చలకు రావాలని అంటున్నాం

PRC పైమంత్రి బొత్స సత్యనారాయణ గారు.ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించడానికే చర్చలకు రావాలని అంటున్నాం

అపోహలు తొలగించడానికే మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు.

అసలు నాయకులు రాకుండా సెకండ్ స్థాయి నేతలు వచ్చి మూడు అంశాలపై మాకు లేఖ ఇచ్చారు.

లేఖ ఇచ్చిన వాటిపై చర్చలకు రావాలని కోరాం.. వాళ్ళు మాత్రం రావడం లేదు.

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.

మమ్మల్ని అలసత్వంగా తీసుకుంటున్నారేమో.. వాళ్ళు పిలిచే వరకూ చర్చలకు వెళ్లకూడదని అనుకున్నాం.

కొత్త పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాలు వస్తాయి.. ప్రాసెస్ జరుగుతుంది.

ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందే అంటున్న సంఘాల నాయకులు ట్రెజరీ ఉద్యోగుల్ని, DDO లను పని చేయొద్దు అంటున్నారు.

జీతాల విషయంలో ఈ ద్వంద వైఖరి ఏంటి..

వాళ్ళు సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.

ఎంత మందికి అయితే అంతమందికి జీతాలు ఇచ్చుకుంటూ పోతాం.

సంఘాల నాయకులు మాటలు తూలనాడొద్దు.. మాటలకు బాధ్యత వహించాలి.

మాకు మాటలు రావా.. మాట్లాడలేకనా..? దూరం పెరుగుతుందని సహనంతో ఉన్నాం.

దుర్భాషలు ఆడిన వారికి పర్యవసానాలు తప్పకుండా ఉంటాయి.

ఉద్యోగుల్ని బూచిగా చూపించాల్సిన అవసరం మాకు లేదు.. ఉద్యోగులు మా వాళ్లే.

1 comment:

  1. నమస్తే.అపోహలులేవు......అన్నీనష్టాలే.మీరుఇచ్చినది P.R.S.కాదు D.A.M.S..DUTY (DEARNESS))ALLOWANCE MERGED SALARIES .

    ReplyDelete