APTF VIZAG: ఉపాధ్యాయ ఉద్యమంపై ఇంటెలిజెన్స్ నిఘా.సంఘాల నేతల కదలికలపై డేగ కన్ను.ఎప్పటికప్పుడు ప్రభుత్వానికినివేదికలు

ఉపాధ్యాయ ఉద్యమంపై ఇంటెలిజెన్స్ నిఘా.సంఘాల నేతల కదలికలపై డేగ కన్ను.ఎప్పటికప్పుడు ప్రభుత్వానికినివేదికలు

పీఆర్సీ, సీపీఎస్ తదితరాలతోపాటు ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ అధికారులు డేగ కన్ను సాధించారు. వారి కదలికలపై నిఘా ఉంచడంతోపాటు, ఎక్కడెక్కడికి వెళ్లి, ఎవరెవరిని కలుస్తున్నారనే విషయాలపైనా ఆరా తీస్తున్నారు. అలాగే సంఘాల నేతలు బహిరంగ సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలను రికార్డు చేసి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. పోలీస్ శాఖలో కీలక విభాగమైన ఇంటెలిజెన్స్ రెగ్యులర్ డ్యూటీల్లో నిఘా అనేది భాగమే అయినప్పటికీ.. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే కన్నేయడం చర్చలకు కారణమవు తోంది. సాధారణంగా రాజకీయ సమావేశాలు, అనుమానాస్పద అంశాలు, వ్యక్తులపై వీరు నిరంతరం నిఘా ఉంచుతారు. అలాగే నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల వ్యవహారాలు, వాటికి కారణాలు, తదనంతర పరిణామాలపైనా పరిశీలన జరుపుతారు. అయితే ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయ వర్గాలపైనా నిఘా పెట్టడం ఆశ్చర్యకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలాంటివన్నీ మీకెందుకు? అవసరమా? రాష్ట్రంలో ప్రస్తుతం పీఆర్సీపై జరుగుతున్న ఆందోళనల్లో ఉపాధ్యాయ సంఘాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా సంఘాలు సైతం తమ మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి, డిమాండ్ల సాధన కోసం ఏకమవుతున్నాయి. జేఏసీలుగా ఏర్పడి నిరసనలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులకు నిఘా విభాగ అధికారులు, సిబ్బంది ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. 'ఉద్యోగుల ఆందోళనల్లో మీరెందుకు పాల్గొనడం, ఇలాంటివన్నీ మీకెందుకు? అవసరమా?' అంటూ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వం వద్ద ఆందోళనల్లో పాల్గొంటున్న వారందరి సమాచారం ఉంటుంది. భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకుంటే మీరూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందంటూ అడగకుండానే సలహాలు ఇస్తున్నారని కొందరు నాయకులు చెబుతున్నారు. మరోవైపు సమావేశాల్లో ఆయా సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, కార్యాచరణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు. ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపుతున్నారు. దీంతో 'అతిక్రమిం చివ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నా యని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ముందుండి నడిపిస్తున్న ఒకరిద్దరి షోకాజ్, మెమోలు ఇస్తే.. మిగిలిన వారు వెనకడుగు చేసే అవకాశం ఉంటుందని, కనుక ఆ దిశగానూ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు న్యూట్రల్, లెఫ్ట్ భావజాల సంఘాలు ఉద్యమాల్లో పాల్గొంటుండగా.. ఇటీవల పరిణామాలతో ప్రభుత్వ అనుకూల సంఘాలూ నిరసనలకు మద్దతి స్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఉద్యోగులందరి సమస్య అయినప్పుడు కూడా రోడ్డెక్కకుంటే తమ సంఘాల ఉనికి పోతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారని, అందుకే తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తోందని తమకు ఫోన్ చేసిన అధికారులకు చెప్పినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today