APTF VIZAG: ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు షాక్‌... వేతన బిల్లులను ప్రాసెస్ చేయం: ట్రెజరీ ఉద్యోగుల సంఘం

ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు షాక్‌... వేతన బిల్లులను ప్రాసెస్ చేయం: ట్రెజరీ ఉద్యోగుల సంఘం

 ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగులు షాక్‌ ఇచ్చారు. వేతన బిల్లులను ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని ట్రెజరీ ఉద్యోగుల సంఘం నిరసించింది. తాము కూడా ఉద్యమంలో భాగమేనని సంఘం పేర్కొంది. 

 ప్రభుత్వం పెండింగ్‌ డీఏలు మంజూరు చేసి జీతం పెరిగినట్లు చూపిస్తున్నారన్న సంఘం ఆరోపించింది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులో కోత విధించడం అన్యాయమని ట్రెజరీ ఉద్యోగులు పేర్కొన్నారు.

 పలు జిల్లాల్లో వేతన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేయలేదు. దీంతో ఈనెల 25లోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించింది. ఈ ఆదేశలను అమలు చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు, డ్రాయింగ్ అధికారులు నిరాకరించారు.

No comments:

Post a Comment