APTF VIZAG: Ap deecet counciling shedule and website

Ap deecet counciling shedule and website

 నేటి నుంచి డీఈఈ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్

 ఏపీలో ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ డీఈఈ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుంది. డీఈఈ సెట్-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో అప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. అప్షన్లను క్రిందివెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. 'http://apdeecet.apcfss.in, http://cse.ap.gov.in

 సీట్లను జనవరి 10, 11, 12 తేదీల్లో కేటాయిస్తామ న్నారు. జనవరి 13న ప్రొవిజనల్ అలాట్ మెంట్ లెటర్లను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాళ్ల పరిశీలన, తుది అలాట్మెంట్ లెటర్లను జనవరి 17 నుంచి 20 వరకు విడుదల చేస్తామని తెలిపారు. జనవరి 31 నుంచి కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు

No comments:

Post a Comment