APTF VIZAG: పీఆర్‌సీపై సీఎం జగన్‌ త్వరలో నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ.పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం: సీఎస్‌ సమీర్‌శర్మ

పీఆర్‌సీపై సీఎం జగన్‌ త్వరలో నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ.పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం: సీఎస్‌ సమీర్‌శర్మ

PRC: పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని సీఎస్‌ సమీర్ శర్మ వెల్లడిచారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామన్న సీఎస్‌.. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని చెప్పారు. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు.

'పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించాం. పీఆర్‌సీపై సీఎం జగన్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటారు. పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుంది' - సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment