APTF VIZAG: ఏపీ సీఎస్ కి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన ఉద్యోగుల సంఘాలు.

ఏపీ సీఎస్ కి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన ఉద్యోగుల సంఘాలు.

బండి శ్రీనివాసరావు ,ఏపీ జేఏసీ అధ్యక్షడు

సీఎస్ కి ఉద్యమ కార్యచరణ నోటీస్ ఇచ్చాము .

నెలరోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టు తిరిగి అలసిపోయాము.

మాకు ఇవ్వాల్సి పిఆర్సీ ,డీఏలు వంటి 45 డిమాండ్స్ ఇవ్వాలని వేడుకున్నాము.

ప్రభుత్వ పెద్దల మాటలు మూటలుగానే అయ్యాయే తప్పా అమలు కాలేదు.

మేము ప్రకటించిన కార్యాచరణ యధావిధంగా అమలు చేస్తాం.

ఈ నెల 7నుండి మా ఉద్యమం ప్రారంభం అవుతుంది.

ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమే.

పిఆర్సీ నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదు.

55శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే.

 మేము దాచుకున్న 1600కోట్లు ఇవ్వమని ఆడిగినా ఇవ్వడం లేదు..

బొప్పారాజు, వెంకటేశ్వర్లు ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు

5పేజీల ఉద్యమ కార్యాచరణ ను సీఎస్ కు ఇచ్చాము.

నవంబర్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సజ్జలతో పాటు మిగతా ప్రభుత్వ పెద్దలు చెప్పారు.

మూడేళ్ళుగా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించాము.

కరోన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఉద్యోగులుగా సహకరించాము.

కరోన సమయంలో మా జీతాల్లో కోత విధించిన సమయంలో కూడా సహకరించాము.

కారుణ్య నియామకాల్లో ప్రభుత్వం మాట తప్పింది.

ఉద్యోగుల రోడ్డు మీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణం.

పిఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదు..

పీఆర్సీ నివేదికలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాము.

జీతాల గురించి,ఉద్యోగులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

ప్రభుత్వానికి ,ఉద్యోగుల మద్య దూరం పెంచేలా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి.

రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యోగులను సంఘటితం కావాలి..

రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాంతీయ సభలు పెట్టబోతున్నాము..

పోరాటం ద్వారా ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది..

సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులు సమస్యల పై స్పందిస్తారని ఎదురు చూస్తున్నాము..

No comments:

Post a Comment