ఉద్యోగుల, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్సీలు ఈ నెల 3న నిరాహార దీక్ష చేపట్ట నున్నట్లు ఫ్యాప్టో వెల్లడించింది. ఫ్యాప్టా కార్యవర్గ సమావేశం ఎస్టీయ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నాయకులతో పాటు శాసన మండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాల సుబ్ర హ్మణ్యం పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలైన పిఆర్సి డిఎలు, సిపిఎస్ రద్దు, విద్యారంగ సమస్యల పరిష్కారంలో జాప్యాని నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు చైర్మన్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు సెక్రటరీ జనరల్ సిహెచ్ శరత్చంద్ర ప్రకటన ద్వారా తెలిపారు.
No comments:
Post a Comment