APTF VIZAG: మూడేళ్లలో NEP అమలు.25వేల స్కూళ్ల విలీనం.సమీక్షలో సిఎం జగన్

మూడేళ్లలో NEP అమలు.25వేల స్కూళ్ల విలీనం.సమీక్షలో సిఎం జగన్

రానున్న మూడేళ్లలో నూతన విద్యావిధానం (NEP) దశలవారీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 2021-22 నుంచి 2022-23, 2023-24 వరకూ మూడు విద్యాసంవత్సరాల్లో మూడు దశల్లో అమలు కావాలని చెప్పారు. నూతన విద్యావిధానం అమలుపై తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం NEP అమలుకు అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను గుర్తించాలని చెప్పారు. పాఠశాలల్లో సదుపాయాలు, సమస్యలు, ఇబ్బందులు ఉంటే విద్యార్థులు వెంటనే కాల్చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని చెప్పారు. ఇంగ్లీష్ ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టి పెట్టాలని తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని వెల్లడించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, తనిఖీలు చేయాలని చెప్పారు. గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, కలెక్టర్లు, అధికారులు స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని చెప్పారు. 2021-22 విద్యాసంవత్సరంలో 1092 పాఠశాలలకు సిబిఎస్ఇ అఫిలియేషన్ జరిగాయని అధికారులు సిఎంకు వివరించారు. 2024 25 నాటికి విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికార్లు బి రాజశేఖర్, ఎఆర్ అనురాధ, చినవీరభద్రుడు, కృతికా శుక్లా, వెట్రిసెల్వి పాల్గొన్నారు.

No comments:

Post a Comment