APTF VIZAG: మూడు వారాల్లో కట్టకపోతే.. కళాశాలలు వసూలు చేసుకోవచ్చు.బోధన రుసుములపై ప్రభుత్వ ఉత్తర్వులు.

మూడు వారాల్లో కట్టకపోతే.. కళాశాలలు వసూలు చేసుకోవచ్చు.బోధన రుసుములపై ప్రభుత్వ ఉత్తర్వులు.

జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసిన బోధన రుసుముల్ని వారం రోజుల్లోగా వారు కళాశాలలకు కట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మూడు వారాల తర్వాత కూడా కట్టకపోతే వారినుంచి కళాశాలలు నిర్దేశిత విధానంలో వసూలు చేసుకోవచ్చు. అయినా చెల్లించకపోతే తదుపరి విడత రుసుముల్ని నేరుగా కళాశాలలకు ఇస్తామని ఉత్తర్వులు జారీచేసింది. ఫీజు చెల్లించనివారిపై కళాశాలలు జ్ఞానభూమి పోర్టల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.

ఉత్తర్వుల్లో పేర్కొన్న విధానం.. ఇలా

ప్రభుత్వం బోధన రుసుముల్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసిన వారంలోగా చెల్లించకపోతే సంబంధిత కళాశాల యాజమాన్యం జ్ఞానభూమి పోర్టల్‌లో కేటాయించిన లాగిన్‌లో ఫిర్యాదు నమోదుచేయాలి.

కళాశాలలు నమోదుచేసిన ఫిర్యాదులు సంక్షేమ విద్యా సహాయకుడు లేదా వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి లాగిన్‌కు వెళ్తాయి.

అధికారులు వాస్తవాల్ని పరిశీలించి.. తల్లిదండ్రులు ఫీజు చెల్లించేలా చూడాలి. కళాశాలలు ఫిర్యాదు నమోదుచేసిన పది రోజుల్లోగా చెల్లించాలి.

ఫిర్యాదు నమోదైన మూడు వారాల తర్వాత కూడా విద్యార్థి/ తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే.. నిబంధనల ప్రకారం వసూలుచేసుకునే స్వేచ్ఛ కళాశాలలకు ఉంటుంది.

No comments:

Post a Comment