APTF VIZAG: ప్రారంభమైన 3,4,5 తరగతుల విలీన ప్రక్రియ

ప్రారంభమైన 3,4,5 తరగతుల విలీన ప్రక్రియ

రాష్ట్రంలో 250 మీటర్ల పరిధిలోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేసే ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబరు 30వరకు మ్యాపింగ్‌ పూర్తి చేసి, నవంబరు ఒకటి నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలకు అనుసంధానించాలని గత ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,178 ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో 3,627 ప్రాథమిక బడులు ఉన్నాయి అయితే పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలల్లో స్పష్టత లేకపోవడంతో సోమవారం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.. కొన్ని అంశాలపై సందిగ్ధత ఉండడంతో  చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు.  ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరత కారణంగా 3,4,5 తరగతులను కలిపేసినా ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాల భవనంలోనే వీటిని కొనసాగించాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment