APTF VIZAG: ఉపాధ్యాయుల చేత ఆ పనులేంటి ? బోధన తప్ప మిగిలిన పనులన్నీ చేయిస్తున్నారు సచివాలయ , ఆర్బీకేల తొలగింపు నకు ఏం చేశారో చెప్పండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం .. విచారణ 15 కి వాయిదా

ఉపాధ్యాయుల చేత ఆ పనులేంటి ? బోధన తప్ప మిగిలిన పనులన్నీ చేయిస్తున్నారు సచివాలయ , ఆర్బీకేల తొలగింపు నకు ఏం చేశారో చెప్పండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం .. విచారణ 15 కి వాయిదా

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల చేత పాఠాలు బోధించడం తప్ప మిగిలిన పనులన్నీ చేయిస్తున్నారని ఉన్నతాధికారు లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది . మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ , మరుగుదొడ్ల శుభ్రత ఇలా పలు అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులకు అప్పగించి , వాటి ఫొటోలను ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారని , దీంతో వారికి పాఠాలు చెప్పే సమయమే చిక్కడంలేదని పేర్కొంది . ఇలా ఉపాధ్యాయులను ఇతర పనులకు వినియోగించడం చాలా తీవ్రమైన విషయమని తెలిపింది . ఉపాధ్యాయులను విద్యా బోధనకు తప్ప మిగిలిన విషయాలకు ఉప యోగించకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ( ఏజీ ) ఎస్.శ్రీరామ్కు సూచిం చింది .

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన రైతుభరోసా కేంద్రాలు ( ఆర్బీకేలు ) , గ్రామ సచి వాలయాల నిర్మాణాలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ఎంతవరకు వచి ఎందో తెలియచేస్తూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది .

తదుపరి విచారణను ఈ నెల 15 కి వాయిదా వేసింది .

No comments:

Post a Comment