ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవం గా ఆమోదించింది.
1 . PRC , DA , CPS రద్దు తదితర ఆర్థిక పరమైన అంశాల పై JAC లు ఉద్యమ కార్యాచరణ ను వారం రోజులలో ప్రకటించకపోతే ఫ్యాప్టో పక్షాన రాష్ట్రస్థాయి లో ఉద్యమం చేపట్టాలి
2 . వాస్తవ పరిస్తితులను పరిగణనలోకి తీసుకో కుండా 4 జిల్లాల పరిధిలోని మెజారిటీ ప్రధానోపాధ్యా యులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఉపసంహరించాలి*
ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకొవాలి అనే న్యాయమైన డిమాండ్ తో కడప RJD కార్యలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన HMA రాష్ట్ర అధ్యక్షులకు ఇచ్చిన చార్జీ మెమో ను తక్షణం ఉపసంహరించాలి
కక్ష్య సాధింపు ధోరణి తో వ్యవహరిస్తున్న కడప RJD గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నత అధికారులను కలిసి ప్రాతినిధ్యం చేయాలని , RJD గారిని సస్పెండ్ చేయని పక్షాన , FAPTO అద్వర్యం లో కడప RJD కార్యాలయం ముట్టడి కి పిలుపు ఇవ్వాలి
3 . ఉపాధ్యాయుల పై యాప్ ల భారం తొలగించాలని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ అది మూలపు సురేష్ గారిని మరియు ముఖ్య కార్యదర్శి , పాఠశాల విద్య, వారిని FAPTO ప్రతినిథి బృందం కలిసి వారికి వాస్తవ పరిస్తితి వివరించాలి , యాప్ ల భారం తొల గించని పక్షములో యప్ ల బహిష్కరణ కు పిలుపు నివ్వాలి
4. 3,4,5 తరగతుల తరలిం పు నిలుపుదల చెయ్యాలి. ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యా యుల కొరత అధికంగా ఉన్నం దున అర్హత గల SGT లకు పదో న్నతి కల్పించాలని ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చెయ్యాలి.
5 .కర్నూలు , ప్రకాశం, విజయ నగరం జిల్లాలలో ఉపాధ్యాయ సంఘ నాయకుల పై పెట్టిన కేసులను ఉపసంహరించాలని గౌరవ హోమ్ మినిస్టర్ గారిని మరియు గౌరవ DGP గారిని ఫ్యాప్టో పక్షాన కలిసి ప్రాతినిథ్యం చేయాలి
చైర్మన్ & సెక్రటరీ జనరల్
FAPTO ,
No comments:
Post a Comment