26న డీఈఈ సెట్
ప్రభుత్వ, ప్రైవే టు ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్-2021ను ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్ కె. రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష జరుగుతుందని వివరించారు. అభ్యర్థుల హాల్ టికెట్లను 'https://cse.ap.gov.in లేదా 'https://apdeecet.apcfss.in' వెబ్సైట్లలో పొందుపరిచామని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షకు గంట ముందుగా కేంద్రానికి హాజరు కావాలన్నారు.
No comments:
Post a Comment