APTF VIZAG: Blue Aadhar Card information

Blue Aadhar Card information

Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి? ఎవ‌రికి ఈ కార్డు ఇస్తారు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? 

మామూలుగా ఆధార్ కార్డు అంటే ఒకటే ఉంటుంది క‌దా.. ఇందులో బ్లూ ఆధార్ కార్డు ఏంటి? ఈ పేరు కొత్త‌గా వింటున్నాం అని అంటారా? అవును.. రెగ్యుల‌ర్ ఆధార్ కార్డు వేరు.. బ్లూ ఆధార్ కార్డు(Blue Aadhaar Card) వేరు. దీన్నే బాల్ ఆధార్(Baal Aadhaar) కార్డు అని కూడా అంటారు. ఈ కార్డును 2018లో యూఐడీఏఐ ప్ర‌వేశ‌పెట్టింది. ఇది చూడ‌టానికి కొంచెం బ్లూ క‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. అందుకే దీన్ని బ్లూ ఆధార్ కార్డు అని అంద‌రూ పిలుస్తుంటారు.

ఈ కార్డును 5 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్ల‌ల‌కు ఇస్తారు. ఈ కార్డుకు కూడా 12 డిజిట్లు ఉన్న యూనిక్ ఐడెంటిఫికేష‌న్ నెంబ‌ర్ ఉంటుంది. కార్డుదారుడికి 5 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటితే ఆ నెంబ‌ర్ ఇన్‌వాలిడ్ అవుతుంది.

అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు ఈ కార్డును తీసుకోవ‌చ్చు. దాని కోసం ఎన్‌రోలింగ్ ఫామ్‌ను నింపి.. పేరెంట్ ఐడెంటిటీ కార్డు, అడ్ర‌స్ ప్రూఫ్‌, రిలేష‌న్‌షిప్‌, చైల్డ్‌ డేట్ ఆఫ్ బ‌ర్త్ ప్రూఫ్‌ను జ‌త‌చేయాల్సి ఉంటుంది. బ్లూ ఆధార్ కార్డులో బ‌యోమెట్రిక్‌కు సంబంధించిన స‌మాచారం ఉండ‌దు. ఎందుకంటే.. 5 ఏళ్ల లోపు పిల్ల‌ల నుంచి బ‌యోమెట్రిక్ వివ‌రాలు తీసుకోరు. ఒక‌సారి 5 ఏళ్లు దాటాక బ‌యోమెట్రిక్ అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఆ బ‌యోమెట్రిక్ 15 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌రోసారి బ‌యోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి.

ద‌గ్గ‌ర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లి పైన చెప్పిన డాక్యుమెంట్లు తీసుకెళ్లి పేరెంట్ ఫోన్ నెంబ‌ర్‌ను ఇస్తే.. సిబ్బంది వెంట‌నే బ్లూ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేస్తారు. వెరిఫికేష‌న్ పూర్తికాగానే మెసేజ్ వ‌స్తుంది. రిజిస్ట్రేష‌న్ చేసుకున్న 60 రోజుల్లో బ్లూ ఆధార్ కార్డును సంబంధిత అడ్ర‌స్‌కు పంపిస్తారు. లేదంటే.. ఆధార్ సెంట‌ర్‌కు వెళ్లి అయినా తీసుకోవ‌చ్చు.

No comments:

Post a Comment