APTF VIZAG: ఫ్యాప్టో పక్షాన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారితో చర్చించిన అంశాలు.

ఫ్యాప్టో పక్షాన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారితో చర్చించిన అంశాలు.

నవంబర్, డిసెంబర్ నెలల్లో రేషనలైజేషన్ నిర్వహించి జనవరి మొదటి వారంలో బదిలీలు చేపడతామని తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్ లో హెచ్ఎం ఖాళీలు అనగా 1-11-2020 నాటి ఖాళీలతో పాటు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు కూడా చూపాలని కోరాము. లీగల్ ఒపీనియన్ తీసుకుని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు చూపుతామని, నవంబర్ 1న మిగిలిన ఖాళీలకు ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

ప్రమోషన్స్ లో వేకెన్సీలు బ్లాక్ చేసి చూపడాన్ని గురించి ప్రస్తావించగా నవంబర్ నెల మొదటి వారంలో మరో పదోన్నతుల షెడ్యూల్ ఇస్తామని ఈ షెడ్యూల్ లో బ్లాక్ చేసీన పోస్టుల నన్నిటిని చూపిస్తామని తెలిపారు

అంతర్ జిల్లా బదిలీలు ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉందని, వచ్చిన వెంటనే బదిలీలు చేపడతామని తెలిపారు.

ప్రమోషన్ కి పిలిచే ఉపాధ్యాయులను 1:3 పద్ధతిలో పిలవాలని కోరాము, పరిశీలిస్తామని తెలిపారు

సీనియారిటీ జాబితాలను రూపొందించేటపుడు అన్ని జిల్లాలలో ఒకే విధానాన్ని అవలంబించాలని కోరగా తగు సూచనలు చేస్తామని తెలిపారు.

చైర్మన్ & సెక్రటరీ జనరల్

        FAPTO, AP

No comments:

Post a Comment