APTF VIZAG: AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక సంయుక్త పత్రికా ప్రకటన..13/10/2021. 11 వ PRC అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభించి ఈనెలాఖరు నాటికి పూర్తిచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు..

AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక సంయుక్త పత్రికా ప్రకటన..13/10/2021. 11 వ PRC అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభించి ఈనెలాఖరు నాటికి పూర్తిచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు..

హర్షం వ్యక్తం చేసిన ఇరు JACల ఐక్యవేదిక నాయకులు...బండి శ్రీనివాసరావు, బొప్పరాజు.

  ది 12/10/2021 న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన మెమొరాండం పై ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు AP JAC & AP JAC అమరావతీ నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, జి హృదయరాజు, వై వి రావు, కె వి శివారెడ్డి, జి వి నారాయణరెడ్డి గార్లు చర్చలలో పాల్గొనటమైనది.

ఈ సందర్భంగా గౌ11 ముఖ్యమంత్రి గారి అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ కె ధనంజయరెడ్డి IAS గారు మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్లు AP JAC & AP JAC అమరావతి ఐక్య వేదిక ఇచ్చిన మెమొరాండం లోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సహకారం మరువలేనిదని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యాయని వాటిని పరిష్కరిస్తామని తెలియచేశారు.

చర్చించిన ప్రధాన అంశాలు:

● ఈ నెలాఖరునాటికి అన్ని సంఘాలతో చర్చించి 11 వ PRC ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 

● కొన్ని ఆర్ధిక ఇబ్బందులవలన మూడు నెలలుగా కొంతమందికి జీతాలు, పెన్షన్లు జాప్యం జరిగిందని ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే నెల నుంచి 1 వ తారీఖునే చెల్లింపులు చేస్తామని తెలియచేశారు. ఒక వేళ  ఒకట్రెండు రోజులు జాప్యం జరిగే అవకాశముంటే ఉద్యోగ సంఘాలు కోరినట్లు.. ముందుగా 1 వ తారీఖు కల్లా పెన్షనర్స్ కు చెల్లింపులు చేస్తామని చెప్పారు.

● ఉద్యోగులు, పోలీసులకు రావాల్సిన సరండర్ లీవ్, APGLI లోన్స్, GPF లోన్స్, మెడికల్ రీయంబర్స్మెంట్ తదితర బిల్లులు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని తెలియచేశారు. అలాగే ఇప్పటివరకు క్లియర్ కానీ ఉద్యోగుల/ఉపాధ్యాయుల /పెన్షనర్ల పెండింగ్ బిల్లుల వివరాలు మొత్తం కూడా తెలియచేసే విధంగా ఫైనాన్స్ అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

● CPS రద్దు , కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్సౌర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు విషయాలను ప్రాధాన్యత క్రమంలో వచ్చే నెలాఖరు నాటికి పూర్తిచేసే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తామని తెలియచేశారు.

●  జూలై, 2021అఖరుతో ముగిసిన మెడికల్ రియంబర్స్మెంట్ గడువును త్వరలో పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

● జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 17,18 వ తేదీలలో ఏర్పాటు చేసి ఉద్యోగులకు వున్న సమస్యలపై సంఘాలతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 

● ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న మరొక ముఖ్యమైన సమస్య EHS - దానిపై మూడు, నాలుగు రోజుల్లో CEO గారు,  హాస్పిటల్ యాజమాన్యాలు మరియు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిపి ఒక సంయుక్త సమావేశం నిర్వహించి EHS అమలులో వస్తున్న సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

● కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు వెంటనే ప్రతి జిల్లాలో ఒక *"ఉద్యోగ మేళా"* లాగా పెట్టి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకాలు తక్కువ సమయంలో ఇచ్చేందుకు తగు ఆదేశాలు ఉన్నతాధికారులకు ఇస్తామని హామీ ఇచ్చారు.

● ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సంబంధిత శాఖాపరమైన విషయాలలలో  ఆయా ఉద్యోగ సంఘాల సలహాలు, సూచనలు కూడా స్వీకరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

◆ AP JAC & AP JAC అమరావతి ల ఐక్యవేదిక ప్రభుత్వం ముందు వుంచిన ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించమని ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆదేశానుసారం స్పందించి పరిష్కరిస్తున్న వారి అదనపు కార్యదర్శి శ్రీ కె ధనంజయరెడ్డి IAS గారికి, గౌ11ప్రధాన సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి AP JAC & AP JAC అమరావతిల ఐక్యవేదిక తరపున హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞత లు తెలియచేస్తున్నాము.

◆ అలాగే రెండు JAC లు కలిసి ప్రయాణం చేసిన కేవలం 5 రోజుల్లోనే ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కొరకు కృషి చేస్తున్నామని, ఇది కేవలం ఇరు jac ల ఐక్యత వల్లే సాధ్యమైనందని బండి శ్రీనివాస్ & బొప్పరాజు తెలిపారు.

అలాగే AP JAC & AP JAC అమరావతిల ఐక్యవేదిక  ఏర్పాటు నుంచి ఎప్పటికప్పుడు విషయాలను ప్రభుత్వం వద్దకు, ఉద్యోగులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

బండి శ్రీనివాసరావు & బొప్పరాజు

No comments:

Post a Comment