APTF VIZAG: 3,4,5 తరగతుల విలీన ప్రక్రియ – సూచనలు

3,4,5 తరగతుల విలీన ప్రక్రియ – సూచనలు

కమిషనర్ పాఠశాల విద్య వారి ఉత్తర్వుల సంఖ్య 151- A&I-2020 మేరకు.. ఉన్నత పాఠశాల ప్రాంగణం లో ఉన్న / ఆనుకొని ఉన్న / 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలలోని 3,4,5 తరగతులను నవంబర్ 1వ తేదీ నుండి ఉన్నత పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది.

1,2 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహించ వలెను.

1,2 తరగతులకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి 1:30 నిష్పత్తి లో ఉపాధ్యాయులను కొనసాగించవలసి ఉంటుంది.

మిగిలిన ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకి మార్పు చేయవలయును. 

జూనియర్ (తక్కువ సర్వీసు ఉన్న ) ఉపాధ్యాయుడుని తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో ఉండేలా చూడాలి.

ఒకవేళ సీనియర్ ఉపాధ్యాయునికి ఉన్నత పాఠశాలలో బోధించుటకు తగిన అర్హతలు లేకపోతే జూనియర్ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాల కు మార్పు చేయవలెను.

ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు కలిగిన PSHM యొక్క అభీష్టం మేరకు ఉన్నత పాఠశాలకు మార్పు చేయాలి. ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు లేనిచో ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలి.

ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు బోధించుటకు తగిన వసతి లేనట్లయితే ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ లో 3,4,5 తరగతులు నిర్వహించాలి

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today