రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్) కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్‌ను ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆన్‌లైన్ ప్రవేశాల షెడ్యూల్‌ను విజయవాడలో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని 35% సీట్లను వెబ్ కౌన్సెలింగ్ పరిధిలోకి తీసుకొచ్చాం. వాటికి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌తోపాటు జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 25 హెల్ప్‌లైన్ సెంటర్లలో పరిశీలిస్తాం. కేటగిరి-బీ కింద యాజమాన్య కోటాలో భర్తీ చేసే 30% సీట్లలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటాలో మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటాతో కలిపి భర్తీ చేస్తాం’’ అని వివరించారు.
కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్న సీట్లు..
ఇంజిఫార్మసీ, ఫార్మా-డీకి సంబంధించిన 36 యూనివర్శిటీ కళాశాలల్లో 6,747 సీట్లు (ఈడబ్ల్యూఎస్ కోటా కలిపి), 297 ప్రైవేటు కళాశాలల్లో 72,520, నాలుగు ప్రైవేటు వర్సిటీల్లో 2,330 సీట్లను భర్తీ చేస్తాం. మొత్తంగా కన్వీనర్ కోటాలో ప్రస్తుతం 81,597 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని 91 ఇంజినీరింగ్, 21 ఫార్మసీ కళాశాలల గుర్తింపుపై కొంత సమస్య ఉంది. దీన్ని వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే నాటికి పరిష్కరిస్తాం. ఆయా కళాశాలల్లోని కన్వీనర్, యాజమాన్య కోటాలను కలిపితే మొత్తం 1,39,862 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇంజినీరింగ్‌కు 1,35,602 సీట్లు ఉన్నాయి’’ అని మంత్రి సురేష్ వెల్లడించారు.
ఇదీ ప్రవేశాల షెడ్యూల్.
ప్రవేశాలకు ప్రకటన: అక్టోబరు 22.
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 25 నుంచి 30 వరకు..
ధ్రువపత్రాల పరిశీలన: 26 నుంచి 31 వరకు.
No comments:
Post a Comment