APTF VIZAG: Schools reopen ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలు నిర్వహిస్తాం: ఆదిమూలపు సురేశ్‌

Schools reopen ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలు నిర్వహిస్తాం: ఆదిమూలపు సురేశ్‌

ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయిందన్నారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్‌ తరగతులు జరగడం లేదని.. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment