ఆర్థికంగా వెనుకబడి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు 'విద్యాదాన్' ఉపకార వేత నాలు అందజేస్తున్నట్టు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
వివ రాలకు www.vidyadhan.org సందర్శించాలని
రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 90 శాతం/9 సీజీపీఏ, దివ్యాంగ విద్యార్థులైతే 75 శాతం/7.5 సీజీపీఏ మార్కులు సాధించి నవారు అర్హులని పేర్కొంది. ఎంపికైన విద్యా ర్థులకు ఇంటర్/డిప్లొమా రెండేళ్ల చదువు నిమిత్తం ఏడాదికి రూ.6 వేల చొప్పున, అనంతరం ప్రతిభ ఆధారంగా ఉన్నత చదు వుల కోసం రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తామని ఫౌండేషన్ పేర్కొంది. వచ్చే నెల 25వ తేదీన రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి విద్యార్థులను ఉప కార వేతనాలకు ఎంపిక చేయనుంది. 8367751309 నంబర్కు ఫోన్ చేయవచ్చని సూచించింది.
No comments:
Post a Comment