APTF VIZAG: స్వాతంత్ర్య దినోత్సవం ఉద్యోగుల జీతాల అంశాన్ని ప్రస్తావించిన సీఎం.సీఎం ఉపన్యాసం లోని ముఖ్యాంశాలు.

స్వాతంత్ర్య దినోత్సవం ఉద్యోగుల జీతాల అంశాన్ని ప్రస్తావించిన సీఎం.సీఎం ఉపన్యాసం లోని ముఖ్యాంశాలు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చివరల్లో ఉద్యోగాల జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామన్నారు.. చాలీ చాలని జీతంతో ఉన్న చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచామని.. ఉద్యోగులకు చేయాల్సినవి మరి కొన్ని ఉన్నాయని నాకు తెలుసు.. ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.

గత కొంత కాలంగా కన్పించని శత్రువుతో పోరాడుతున్నాం అన్నారు సీఎం వైఎస్‌ జగన్.. గత 16 నెలల కాలంలో ఆశించిన రెవెన్యూ రాలేదు.. వ్యయం మాత్రం అనుకోని విధంగా పెరిగిందన్న ఆయన.. నేటి కంటే రేపు బాగుండేలా ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర గతిని మార్చే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.. ఇక, రైట్ టు ఎడ్యుకేషనే కాదు.. రైట్ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు ఏపీ సీఎం. . మరోవైపు.. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని'' సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today